మావోయిస్టుల(Maoists)కు కోలుకోలేని దెబ్బ తగిలింది. చరిత్రలోనే ఎన్నడూ లేనంత నష్టాన్ని చవిచూసింది. ఉద్యమం మొదలైనప్పటి నుంచీ ఈ స్థాయిలో మావోయిస్టులు చనిపోవడం ఇదే తొలిసారి. అయితే, ఈ ఆపరేషన్ వెనుక కీలక పరిణామం ఉన్నట్లు తెలుస్తోంది.
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లో తరచూ సాగుతున్న మావో ఆపరేషన్లు…
ఒకప్పుడు తెలంగాణ(Telangana) మావోయిస్టుల(Maoists)కు కంచుకోటగా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో మావోయిస్టు కార్యకలాపాలు, ఎన్కౌంటర్లు, దాడులు, హెచ్చరికలు నిత్యకృత్యంగా కొనసాగేవి. అయితే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు దాదాపు కనుమరుగయ్యాయి. అయితే, తెలంగాణ సరిహద్దుల్లోని ఛత్తీస్‌గఢ్‌లో మావో ఆపరేషన్లు తరచూ సాగుతున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్..
ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్(Encounter) జరిగింది. అయితే, ఓ తెలుగు అధికారే ముందుండి ఆపరేషన్ కొనసాగించారు. మావోయిస్టుల ఆనుపానులు తెలిసిన, వాళ్ల వ్యూహాల గురించి అవగాహన ఉన్న సీనియర్ అధికారి ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌కు మాస్టర్‌మైండ్‌గా చెబుతున్నారు.
ఛత్తీస్గడ్ ఎన్కౌంటర్ లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో మృతి..
ఛత్తీస్గడ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టులు ఇంత పెద్ద సంఖ్యలో మృతి చెందడం ఇదే తొలిసారి. దండకారణ్యం మరోమారు నెత్తురోడింది. ఒకప్పుడు గూగుల్ మూడోకంటికి కూడా అందని విధంగా.. నక్సల్స్‌కు కంచుకోటగా ఉన్న అబూజ్‌మడ్‌లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఇటువైపు.. బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ ఇద్దరు జవాన్లకు ఈ ఎదురుకాల్పుల్లో గాయాలయ్యాయి. బస్తర్ రీజియన్ లోని కాంకేర్ జిల్లాలో చోటేబేటియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ ఆపరేషన్ కు తెలుగు ఐపీఎస్ అధికారి నేతృత్వం వహించడం విశేషం. తెలుగు రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారి ఇందిర కల్యాణ్ ఈ ఆపరేషన్ ను ముందుండి నడిపారు.
శంకర్రావు తో పాటు 29 మంది మావోయిస్టులు మృతి..
ఈ ఎన్కౌంటర్ లో కాంకేర్ అగ్రనేత శంకర్రావు సహా 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. శంకర్రావు తో పాటు 29 మంది మావోయిస్టులు చనిపోయారు. శంకర్ పై 25 లక్షల రివార్డు ఉంది. వీరి వద్ద ఏడు ఏకే 47 తుపాకులు, మూడు ఎంఎంజీలు, ఒక ఇన్సాస్ రైఫిల్ సహా, పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ భారీ ఎన్కౌంటర్ జరగడంతో మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకునే అవకాశాలున్నాయని భావించి భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి అన్ని చర్యలు తీసుకుంటున్నాయి.
గడిచిన నెల వ్యవధిలోనే 54 మంది మావోయిస్టులు
ఈ ఏడాది మావోయిస్టులకు ప్రతికూలంగా ఉన్నట్లు తాజా ఘటనలు చెబుతున్నాయి. మంగళవారం నాటి ఘటనతో కలిపి.. ఈ మూడున్నర నెలల్లో మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లలో 79 మంది మావోయిస్టులు చనిపోయారు. గడిచిన నెల వ్యవధిలోనే 54 మంది మావోయిస్టులు చనిపోయారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: రాహుల్ గాంధీపై నరేంద్ర మోదీ సెటైర్లు..!
- త్వరలో ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్ విడుదల
- న్యూఢిల్లీ బరిలో కేజ్రీవాల్, కల్కాజీ నుంచి సీఎం అతిషీ
- బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నాం
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి