బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గెలుపు సుసాధ్యమేనా….

Bojjala Venkata Sudhir Reddy

Advertisements

&NewLine;<p>శ్రీకాళహస్తి నియోజక వర్గం మొదటి నుంచి రాజకీయ చైతన్యం కలిగినది&period; నాయకులే కాకుండా ఓటర్లు కూడా ఎంతో చైతన్యవంతులు&period; నాయకులకు పాఠం చెప్పడం&comma; గుణపాఠం చెప్పడం కూడా ఓటర్లకు వెన్నతో పెట్టిన విద్య&period; ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా దివంగత మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి పేరు ఖరారైంది&period; గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి&comma; గోపాలకృష్ణారెడ్డి సానుభూతి ఆయనకు కలిసి వచ్చే అంశం&period; అంతమాత్రాన గెలుపు నల్లేరు మీద నడక మాత్రం కాదు&period; సొంత పార్టీలోని అసమతి నేతలను మచ్చిక చేసుకోవలసిన అవసరం ఉంది&period; అంతేకాకుండా బిజెపి&comma; జనసేన నాయకులతో కూడా సమన్వయం ఏర్పరచుకోవాలి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పార్టీలో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యేలు ముని రామయ్య&comma; ఎస్సీవి నాయుడు&comma; టికెట్టు ఆశించి భంగ పడిన గాలి చలపతి నాయుడు&comma; డాక్టర్ రాజేష్ లాంటి వారిని కలుపుకొని పోవాలి&period; 2019లో ఓడిపోయిన తర్వాత సుమారు మూడు సంవత్సరాలకు పైగా అందుబాటులో లేకుండా ఉండడం… ద్వితీయ&comma; తృతీయ శ్రేణి నాయకులను&comma; కార్యకర్తలను పెద్దగా పట్టించుకోక పోవడం… పార్టీ కార్యక్రమాలకు ఆర్థిక సహకారం అందించక పోవడం… కొందరి మాటలే నమ్మడం… ఇతరుల మాటలను లెక్కలోకి తీసుకోకపోవడం&period;&period; ఎక్కువకాలం హైదరాబాద్ కి పరిమితం కావటం లాంటి సంఘటనలు జరిగాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎక్కువ మంది నాయకులు&comma; కార్యకర్తలు అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవడం&period;&period; శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద అనవసరంగా హంగామా చేసి తనతో పాటు అందరినీ కేసుల్లో ఇరికించడం… బెయిల్ కోసం కుటుంబాలకు దూరంగా ఉండటం లాంటి సంఘటనలతో కొందరు మనస్థాపానికి గురై ఉన్నారు&period; అటువంటి వారికి పూర్తిస్థాయి భరోసా ఇవ్వాల్సి ఉంది&period; పార్టీ అధికారంలోకి వస్తే పనిచేసిన వారికి పదవులు ఇవ్వడం… పార్టీలో సముచిత స్థానం కల్పించడం లాంటి వాటిపై ఆయన స్పష్టత ఇవ్వాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్