టిటిడి ఇళ్ల పట్టాల పై జగన్ బొమ్మ అవసరమా?

tdp vooka vijay kumar

Advertisements

&NewLine;<p>తిరుపతి&comma; టిటిడి కేటాయిస్తున్న ఇళ్ల పట్టాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటోను వ్యతిరేకిస్తున్న విపక్షాలు&period; పట్టా పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకుంటారని ఎక్కడికక్కడ నాయకులను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు&period; మహతి ఆడిటోరియం లో పట్టా పంపిణీ కార్యక్రమంలో భారీ పోలీసు బందోబస్తు&period; తిరుపతిలో టిడిపి&comma; జనసేన&comma; సిపిఎం నాయకులను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు&period; టిటిడి ఉద్యోగస్తులకు పట్టాల పంపిణీని స్వాగతిస్తున్నాం అని&comma; కానీ పట్టాలపై ఓపక్క వెంకటేశ్వర స్వామి ఫోటో&comma; మరోపక్క జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు టిడిపి సీనియర్ నాయకులు వూకా విజయ కుమార్&period; టిడిపి నాయకులను జనసేన నాయకులను హౌస్ అరెస్టు చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు&period; ఈరోజు ఇంటి పట్టాలపై వేసిన ఫోటోలు రేపు సేవా టికెట్లపై అలాగే టిటిడి సంబంధించిన వెబ్సైట్లో కూడా జగన్ ఫోటో పెడతారా అంటూ టిటిడిఈఓ ధర్మారెడ్డిని&comma; చైర్మన్ కరుణాకర్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నామని అన్నారు&period; ప్రభుత్వం ద్వారా గాని టీటీడీ నిధులు తో గాని ఇవ్వనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటోను ఎలా వేస్తారంటూ ప్రశ్నించారు&period; టిటిడి ఉద్యోగస్తులు వారి సొంత డబ్బుతో కొనుక్కుంటున్న జగన్మోహన్ రెడ్డి పెత్తనం ఏమిటని ప్రశ్నించారు&period; కేవలం కరుణాకర్ రెడ్డి తన కొడుకు అభినయ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు&period; మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారని&comma;ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడానికి కూడా వీలు లేకుండా పోలీసులతో హౌస్ అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ఇది మంచిది కాదని త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..