ఏపీ సీఎం జగన్ గొప్ప మానవతావాది అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కొనియాడారు. జగన్ తీసుకున్న కుల గణన నిర్ణయం చాలా గొప్పదని అన్నారు. కుల గణన వల్ల రాబోయే రోజుల్లో బీసీలకు మరింత సంక్షేమం అందుతుందని చెప్పారు. జగన్ నిర్ణయాలను దేశ వ్యాప్తంగా మెచ్చుకుంటున్నారని…చరిత్రలో జగన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. పేదరికంలో ఉన్నవారు కూడా జగన్ పాలనలో డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారని చెప్పారు. విద్యారంగంలో జగన్ తీసుకొచ్చిన సంస్కరణలతో విద్యార్థుల జీవితాలు మారిపోతున్నాయని అన్నారు. విదేశాల్లో ఎక్కడ చూసినా మనవాళ్లే కనిపిస్తున్నారని చెప్పారు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగా వాడుకున్నారని .. తమకు సరైన పదవులు ఇవ్వకుండా అగౌరవ పరిచారని విమర్శించారు.
జగన్ గొప్ప మానవతావాది – ఆర్.కృష్ణయ్య
69
previous post