118
ముఖ్యమంత్రి జగన్ బుధవారం కాకినాడ వస్తున్నారు. అయితే ఆయన పర్యటన పూర్తిగా బహిరంగ సభకి పరిమితం చేశారు. వాస్తవానికి ఆయన కాకినాడలో నూతనంగా నిర్మించిన కొండయ్య పాలెం ఫ్లై ఓవర్, కళాక్షేత్రం, సైన్స్ మ్యూజియం, స్కేటింగ్ ట్రాక్ ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొనాలి. కానీ కాకినాడలో అంగన్వాడీలు, సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారు. వాలంటీర్లు కూడా ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన పరిమితమవుతోంది. ఎస్పీ ఆఫీసులో హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి 30 మీటర్ల దూరంలో ఉన్న బహిరంగ సభ ప్రాంగణానికి సంక్షేమ పథకాల లబ్ధిదారులతో శోభాయాత్ర గా వెళ్తారు. బహిరంగ సభ నుంచే వాటిని ప్రారంభిస్తారు.