జనసేన నేత నాదెండ్ల మనోహర్ అరెస్ట్

Nadendla Manohar

Advertisements

&NewLine;<p>జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ను వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు&period; విశాఖలోని నొవాటెల్ హోటల్ వద్ద ఆందోళన చేస్తున్న మనోహర్ ను&comma; ఇతర జనసేన నేతలు&comma; కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో అక్కడి నుంచి తరలించారు&period; టైకూన్ కూడలిలో రోడ్డు మూసివేతను నిరసిస్తూ మనోహర్ నేతృత్వంలో జనసేన ధర్నా చేసింది&period; వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా నిర్మిస్తున్న కట్టడానికి వాస్తు బాగోలేదని రోడ్డును మూసేశారని ఈ సందర్భంగా మనోహర్ మండిపడ్డారు&period; వైసీపీ నేతల నిర్మాణాలకు వాస్తు దోషం ఉంటే రోడ్లను మూసేస్తారా అంటూ ప్రశ్నించారు&period; తమ ధర్నా రాజకీయ కార్యక్రమం కాదని శాంతియుతంగా చేస్తున్న నిరసన కార్యక్రమమని మనోహర్ చెప్పారు&period; తమ ధర్నా కార్యక్రమం గురించి తెలిసి నిన్నటి నుంచి పోలీసులు పలు విధాలుగా తమను అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు&period; తమ వాళ్లను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారని అన్నారు&period; వైసీపీ నేతల ట్రాప్ లో పోలీసు అధికారులు పడొద్దని సూచించారు&period; రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని విమర్శించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..