125
ఎంతోమంది ఆయుష్షుని పెంచాలని ఒక దృఢ సంకల్పంతో తలపెట్టిన కార్యక్రమమే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అని మంత్రి జోగి రమేష్ అన్నారు. కృష్ణాజిల్లా మద్దూరు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 కార్యక్రమంలో పాల్గొన్నారు. బీద బడుగు బలహీన వర్గాలు, అగ్ర కుల పేదవారికి జగనన్నఆరోగ్య సురక్ష కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. సిద్ధం అనే కార్యక్రమం ద్వారా ఎన్నికలకు వెళ్లి ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో ఉన్నటువంటి నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి, మరల ప్రజలను ఎలా మోసం చేయాలి అనే ఆలోచనతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని.. ఇప్పుడు మోడీ, అమిత్ షా వెంట పడుతున్నాడని ఎద్దేవా చేసారు.