102
వేములవాడ రాజన్నను ఆదివారం తెలంగాణ జస్టిస్ పి.శ్రీ సుధ, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి గారు కుటుంబ సమేతంగా దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా స్వామి వారి మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. పుల్ అడిషనల్ చార్జీ సిరిసిల్ల జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్ గారు పూల మొక్కతో స్వాగతం పలుకగా.. అర్చక స్వాములు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అర్చకులు ఆశీర్వదించగా బ్రహ్మన్న గారి శ్రీనివాస్ ప్రసాదం అందజేశారు. వారి వెంట వేములవాడ డిఎస్పి నాగేంద్ర చారి, పట్టణ సీఐ కరుణాకర్ ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు ఆలయ పరిరక్షకులు అల్లి శంకర్, ఆల ఇన్స్పెక్టర్ పవన్, అధికారులు ఉన్నారు.