తెలంగాణకు భారీ పెట్టుబడులు తెచ్చేందుకు హైదరాబాద్లో గ్లోబల్ పీస్ అండ్ ఎకనామిక్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ఇందులో భాగంగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేఏ పాల్ కలిశారు. అనంతరం ఇరువురు సదస్సుపై చర్చించారు. అక్టోబరు 2న హైదరాబాద్లో ప్రపంచ శాంతి, ఆర్థిక సదస్సుకు ఆతిథ్యం ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారని కేఏ పాల్ తెలిపారు. సదస్సుకు హాజరు కావాలని ఇన్వెస్టర్లను కోరుతూ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఉమ్మడిగా వీడియో పాల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు భారీ పెట్టుబడులు తెచ్చేలా సదస్సు నిర్వహణ చేస్తానని హామీ ఇచ్చారు. కేఏ పాల్ అధ్యక్షతన నిర్వహిస్తున్న ప్రపంచశాంతి, ఆర్థిక సదస్సుకు పెట్టుబడు దారులను ఆహ్వానిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కేఏ పాల్..
78
previous post