109
విజయవాడలో ఎంపీ కేశినేని నాని టీడీపీ నేత బోండా ఉమాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బోండా ఉమా ఒక బ్లాక్ మెయిలర్ ల్యాండ్ గ్రాబర్, కిడ్నాపర్ అంటూ వ్యాఖ్యానించారు. బోండా ఉమా ప్రజా జీవితానికి పనికిరారన్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్ చేశారు. తాడేపల్లిగూడెంలో జరిగిన సభలో పవన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడాడన్నారు.
చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ ముష్టి 24 సీట్లు తీసుకున్నాడంటూ ఆరోపించారు. పవన్ రెండు చోట్ల ఓడిపోయి ఇప్పుడు జగన్ ను ఓడిస్తానని అంటున్నాడన్నారు. పవన్ తన గురించి తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడన్నారు. 24 సీట్లకు జన సైనికుల అభిమానాన్ని పవన్ చంద్రబాబుకు తాకట్టు పెట్టాడన్నారు. పవన్ కు ప్రజా జీవితంలో ఉండే అర్హత లేదంటూ కేశినేని నాని విమర్శలు చేశారు.