ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండలం
ఆత్మీయతకు మేమేమి తక్కువ కాము అంటున్న కొండపల్లి మున్సిపాలిటీ, ఇబ్రహింపట్నం మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సంయుక్త కార్యక్రమమైన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిధులుగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శ్రీనివాస్ (నాని) మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త సర్నాల తిరుపతిరావు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మైలవరం నియోజకవర్గం(Mylavaram Constituency) ఇన్ఛార్జ్ సర్నాల తిరుపతిరావు మాట్లాడుతూ నన్ను సమన్వయకర్తగా నియమించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియచేస్తూ మీలో ఒక్కడిగా ఉన్న నన్ను ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చిన రోజును ఎప్పటికీ మర్చిపోలేను అని జగన్ మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, నన్నుఆశీర్వదించాలని రాజకీయాలకు, కులాలకు మతాలకు అతీతంగా నన్ను ఆశీర్వదించాలని కోరారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
దమ్ముంటే నాపై పోటి చేసి గెలవండి- ఎంపీ కేశినేని నాని(Kesineni Nani)
అనంతరం ఎంపీ గారు మాట్లాడుతూ చంద్రబాబు నీకు దమ్ముంటే నాపై పోటి చేసి గెలవండి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన దగ్గర నుండి ప్రజలకు ఎన్నో మంచి మంచి పథకాలను అందించిన వ్యకి జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ పేదవాడి అభివృధ్ది గురించి, వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం కోసమే ప్రతి నిమిషం పనిచేస్తున్న గొప్ప మనసున్న నాయకుడని కొనియాడారు.
మైలవరం నియోజకవర్గ సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావు ని పంపించడం అంటే పెద్ద సాహసమే అని చెప్పాలి. ఒక వెనుకబడిన సామాజికవర్గంలో సామాన్య కార్యకర్త స్థాయి నుండి జడ్పీటిసి గా గెలిచి నేడు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా నియమించబడడం సామాన్య విషయం కాదన్నారు. రాబోయే ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గాన్ని అత్యంత మెజారిటీతో గెలిపించాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎంపీ కేసినేని నాని(Kesineni Nani) సభావేదికగా పిలుపునిచ్చారు.
ఈ ఆత్మీయ సమావేశంలో పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ విభాగాల డైరెక్టర్లు, చైర్మన్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, మరియు కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్స్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.