నేడు నాగార్జున సాగర్ పై కేఆర్ఎంబీ కీలక సమావేశం..

Nagarjuna Sagar Project

Advertisements

&NewLine;<p>నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ అంశంపై నేడు కేఆర్ఎంబీ కీలక సమావేశం నిర్వహించనుంది&period; తెలంగాణ&comma; ఏపీకి చెందిన అధికారులతో కేఆర్ఎంబీ ఈ సమావేశం ఏర్పాటు చేసింది&period; ఈ భేటీలో చర్చించి ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది&period; ఏపీ అధికారులు ప్రాజెక్ట్ కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేయడానికి వారం రోజులుగా ప్రయత్నిస్తుండగా సీఆర్పీఎఫ్ బలగాలు అడ్డుపడుతున్నాయి&period; దీంతో బోర్డు అధికారులు జోక్యం చేసుకొని ఏపీకి నీటిని విడుదల చేశారు&period; ఈ నేపథ్యంలో నేడు జరగనున్న సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది&period; నిజానికి ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కోసం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సారధ్యంలో ఇప్పటికే సమావేశం జరగాల్సి ఉంది&period; కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది&period; నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఏపీకి కేటాయించిన నీటి విడుదల విషయంలో హైడ్రామా చోటుచేసుకుంది&period; అనుమతి మేరకు 5 టీఎంసీల నీటి విడుదల కోసం ఏపీ అధికారులు ప్రయత్నించగా&comma; తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు&period; దీంతో కేఆర్ఎంబీ సభ్యుడు అజయ్ కుమార్&comma; ఈఈలు రఘునాథ్&comma; శివశంకరయ్య ప్రాజెక్టును సందర్శించి ఐదు&comma; ఏడో నంబర్ గేట్లు ఎత్తి ఏపీకి నీటిని విడుదల చేశారు&period; కాగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ తాత్కాలికంగా తెలంగాణ ఆధీనంలో ఉంది&period; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని గంటల ముందు ఏపీ పోలీసులను వెంటబెట్టుకుని వచ్చిన ఆ రాష్ట్ర ఇంజనీర్లు ప్రాజెక్టుపైకి చొచ్చుకువచ్చి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే&period; ఆ పరిణామంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి&period; దీంతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి రెండు రాష్ట్రాల సీఎస్‌లు&comma; ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ప్రాజెక్టు వద్ద యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించారు&period; ప్రాజెక్టు నిర్వహణను తాత్కాలికంగా కేఆర్ఎంబీకి అప్పగించాలని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..