63
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం ఉదయం తెలంగాణ సచివాలయంలోని 5వ అంతస్తు తన చాంబర్లో మంత్రి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన కొన్ని ముఖ్య ఫైల్స్‌పై సంతకాలు చేయనున్నారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 119 స్థానాలకు గాను 64 స్థానాల్లో హస్తం పార్టీ జెండా ఎగిరింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేయగా కొంతమంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కీలక నేతల్లో కోమటి రెడ్డి ఒకరు. గతంలో మంత్రిగా పని చేసిన ఆయన తాజాగా మరోసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.