హైదరాబాద్ నగరంలోని ఓ ఫాం హౌస్ లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీని నార్సింగి పోలీసులు, ఎక్సైజ్ శాఖ, Cyberabad SOT పోలీసులు భగ్నం చేశారు. అయితే ఫాం హౌస్ కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాలది కావడంతో హాట్ టాపిక్ గా మారింది. జన్వాడ రిజర్వ్ కాలనిలో ఉన్న రాజ్ పాకాల ఫాం హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందని పోలీసులకు సమాచారం అందించింది. రాజ్ పాకాల ఫాం హౌస్ లో సైబరాబాద్ ఎస్వోటీ, నార్సింగి పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు గుర్తించి, పార్టీలో పాల్గొన్న వాళ్ళ కి డ్రగ్స్ టెస్ట్ చేపించగా అసలు వ్యవహారం బయటపడింది.
డ్రగ్స్ పార్టీ లో పాల్గొన్న ఒక వ్యక్తికి కొకైన్ డ్రగ్ పాజిటివ్ గా తేలినట్లు సమచారం. డ్రగ్స్ తీసుకున్నట్లు మరికొందరికీ సైతం టెస్టుల్లో పాజిటివ్ గా రావడం కలకలం రేపుతోంది. పార్టీలో పాల్గొన్న వారు కొకైన్ తీసుకున్నట్లు డ్రగ్ టెస్ట్ లో తేలడంతో Ndps యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రాజ్ పాకాల ఫాం హౌస్ లో డ్రగ్స్ పార్టీపై Ndps యాక్ట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ పార్టీలో డ్రగ్స్, విదేశీ మద్యం వినియోగించినట్లు గుర్తించారు. దొరికిన ఫారిన్ బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. Section 34, Excise Act కింద మరో కేసు సైతం నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జన్వాడ ఫాం హౌస్ లో భారీ శబ్దం చేస్తూ పార్టీ నిర్వహిస్తున్నారని పోలీసులు సమాచారం అందింది. డయల్ 100కు ఫోన్ చేసి డ్రగ్స్ పార్టీపై సమాచారం రావడంతో పోలీసులు, సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని డ్రగ్స్ పార్టీని అడ్డుకున్నారు. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న 21 మంది పురుషులు, 14 మంది యువతులు, ఆడవారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. జన్వాడ ఫాం హౌస్ లో లిక్కర్ కు ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని అధికారులు తెలిపారు.
అర్థరాత్రి భారీ డీజే సౌండ్స్ తో డ్రగ్స్ పార్టీ నిర్వహించారని పోలీసులు చెబుతున్నారు. విజయ్ మద్దూరికి డ్రగ్ టెస్టులో పాజిటివ్ గా తేలింది. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా మార్చుతామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపడంలో భాగంగా యాంటీ నార్కోటిక్స్ కు సంబంధించి ఓ విభాగం ఏర్పాటు చేసి చీఫ్ ను నియమించారు. సీఎం రేవంత్ ఎప్పటికప్పుడూ డ్రగ్స్ నియంత్రణపై ఎక్సైజ్ శాఖ, యాంటీ నార్కోటిక్స్, సంబంధిత విభాగాల అధికారులతో సమావేశమై అప్ డేట్స్ తెలుసుకుంటున్నారు. డ్రగ్స్ అరికట్టేందుకు ఎలాంటి చర్యలైనా తీసుకోవాలని, లేకపోతే యువత చెడ్డదారిని ఎంచుకుని జీవితాలు నాశనం చేసుకునే అవకాశం ఉందని పలుమార్లు ప్రస్తావించారు. గతంలో సన్ బర్న్ పేరుతో డ్రగ్స్ పార్టీలు నిర్వహించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది. కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక…
- విష్ణు గొడవ చేయలేదు … మనోజ్ కావాలనే ఇదంతా చేస్తున్నాడుమంచు మనోజ్ ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదన్నారు తల్లి మంచు నిర్మల. మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ వివాదంపై ఆయన భార్య నిర్మల తొలిసారి స్పందించారు. మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై ఆమె స్పష్టతనిచ్చారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి