బిఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ వ్యాపార సంస్థలో 6.66 కోట్ల అవినీతి సొమ్ము .. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ఈ సొమ్మును దాచిపెట్టారు.
ప్రజలు తిరస్కరించినా మారని బిఆర్ఎస్ నేతల బుద్ధి.
అవినీతి సొమ్ముతో లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవాలని చూస్తున్న బిఆర్ఎస్
రాష్ట్రంలోని బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల ఇండ్లలో సోదాలు జరపాలి.. పోలీస్ శాఖకు విజ్ఞప్తి – డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
కరీంనగర్ పట్టణంలోని బిఆర్ఎస్ నేత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కు చెందిన వ్యాపార సంస్థ అయినటువంటి ప్రతిమ మల్టీప్లెక్స్ లో పోలీసులు విశ్వసనీయ సమాచారంతో తనిఖీ చేయగా 6 కోట్ల 66 లక్షల రూపాయల అవినీతి సొమ్ము దొరకడం విచారకరం, కేవలం లోక్‌సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఎన్నికల కోడ్ ప్రకటించే రోజు వరకు వినోద్ కుమార్ కు చెందిన ఈ వ్యాపార సంస్థలో 6 కోట్ల రూపాయలు దాచిపెట్టడం జరిగిందంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ వ్యాపార సంస్థలలో టిఆర్ఎస్ నేతలు ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి సొమ్మును దాచి పెట్టారో అని అనుమానాలకు దారితీస్తుంది, కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న మల్టీప్లెక్స్ లో ఆరు కోట్ల రూపాయలు దాచిపెట్టడం జరిగిందంటే నగర శివారులో సుదూర ప్రాంతాలలో టిఆర్ఎస్ పార్టీ బడా నేతల నివాసాలలో ఫామ్ హౌస్‌లలో పోలీసుల కన్నుగప్పి ఎన్ని కోట్ల రూపాయలు ఇతర జిల్లాలకు రాష్ట్రాలకు తరలించారో అనే అనుమానాలను నివృత్తి చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు వారి బంధువులు అనుచరులు బినామీల ఇండ్లు వ్యాపార సముదాయాలు అనుమాదాస్పద మరియు సౌకర్య కరమైనటువంటి ప్రాంతాలలో భవనాలలో ఏకధాటిగా దాడులు, సోదాలు జరపాలని జిల్లా కాంగ్రెస్ పక్షాన రాష్ట్ర పోలీసు శాఖను కోరుచున్నాము.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అవినీతి సొమ్ముతో ప్రజలను, డబ్బు ఆశతో రాజకీయ నేతలను ప్రలోభ పెట్టడానికి అవకాశం లేకుండా పూర్తి శాంతియుత వాతావరణంలో రాబోయే ఎన్నికలు నిర్వహించే విధంగా పోలీసులు అన్ని రకాల చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎన్నికల బాండ్ల రూపంలో చాలా వ్యాపార సంస్థల నుండి వందల కోట్ల రూపాయల నిధులు సేకరించడం జరిగిందనే విషయాన్ని ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెల్లడించడం జరిగింది, ఈ విధంగా అటు దేశంలో బిజెపి పార్టీ, ఇటు రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అవినీతి సొమ్ముతో రాజకీయాలను శాసించాలనుకోవడాన్ని చూస్తుంటే రానున్న కాలంలో ఈ దేశంలో పూర్తిగా ధన బలంతో, రాజకీయ బలంతో తమ స్వార్థం కోసం తమ రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ప్రజలను దేశ రాజ్యాంగ వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఈ రెండు రాజకీయ పార్టీలు వ్యూహాత్మక రాజకీయాలకు ప్రణాళిక చేస్తున్నారనే ఆలోచనలో భాగంగానే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని భావించవలసి వస్తుందని, ఇది విచారకరమని ఈ విధమైన చర్యలను ప్రతి పౌరుడు ఖండించవలసిన సమయం ఆసన్నమైనదని విజ్ఞులైన తెలంగాణ రాష్ట్ర ప్రజలు బిజెపి బీఆర్ఎస్ పార్టీల ఎత్తుగడలను గమనించాలని ఆ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి