76
ఆంధ్రప్రదేశ్ సెంటర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ మచిలీపట్నం భాస్కరపురంలో నూతన 8 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ ను గురువారం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని నాని తో కలిసి ప్రారంభించారు.
పేర్ని నాని పాయింట్స్…
- మచిలీపట్నంలో 8, ఎం.వి. ఏ, ట్రాన్స్ ఫార్మర్ రూ: కోటి 30 లక్షల తో ఏర్పాటు చేశాం.
- కరెంటు వాడకం పెరగడంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకున్నాం.
- గత వేసవి సమయంలో 10% అదనంగా వాడేవారు కానీ ఇప్పుడు అది 40% పెరిగింది.
- ప్రజల అవసరాలతో పాటు సౌకర్యాలు పెరిగాయి దీంతో విద్యుత్తు వాడకం బాగా పెరిగింది.
- అందుకోసమే ఈ సబ్ స్టేషన్ లో అదనపు ట్రాన్స్ఫార్మర్ నెలకొల్పి మళ్లీ 10 సంవత్సరాలపాటు ఇబ్బందులు రాకుండా చెయ్యడం జరిగింది.