మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మధిర పిలుపునిచ్చారు. జూన్ 26 న మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం పురస్కారించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో డ్రగ్-రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత/విద్యార్థులు అంతా యాంటీ డ్రగ్స్ కమిటీలలో సభ్యులుగా చేరి యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మత్తుపదార్థాల వాడకంతో జీవితం చిత్తు…అవుతుందని , దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా వారం రోజుల పాటు పట్టణాలు, మండలాలలోని పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులకు విస్తృత స్ధాయిలో అవగాహన కార్యక్రమాలు, ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహణలో భాగంగా మొదటి రోజు మధిర హై కేర్ హాస్పిటల్ నుండి మెయిన్ రోడ్ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ముగించారు. ఈ కార్యక్రమాలలో ప్రజలు, యువకులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అధిక సంఖ్యలో పాల్గొని మాదకద్రవ్యాల దుర్వినియోగం మత్తు పదార్థాల వాడక నిర్మూలనకు, మత్తుజ్ రహిత మధిర మండలాన్ని చూడాలని భావనతో ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ సంధ్య, ఎక్స్చేంజ్ శాఖ అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల వారు పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది. కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక…
- విష్ణు గొడవ చేయలేదు … మనోజ్ కావాలనే ఇదంతా చేస్తున్నాడుమంచు మనోజ్ ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదన్నారు తల్లి మంచు నిర్మల. మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ వివాదంపై ఆయన భార్య నిర్మల తొలిసారి స్పందించారు. మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై ఆమె స్పష్టతనిచ్చారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి