అంగన్వాడీలకు అండగా నేనున్నా అని జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ సంఘీభావం తెలిపారు. అంగన్వాడీ వర్కర్లల న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ డిమాండ్ చేశారు. గురువారం రాజంపేట పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట సిఐటియు, ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో పదవ రోజు అంగన్వాడి వర్కర్లు, ఆయాలు వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని నిర్వహిస్తున్న సమ్మెకు జనసేన పార్టీ సంఘీభావం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ జనసేన పార్టీ ఎప్పుడు అంగన్వాడీ కార్యకర్తలకు అండగా ఉంటుందన్నారు. పది రోజులుగా అంగన్వాడి వర్కర్లు సమ్మె నిర్వహిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడం దారుణం అని అన్నారు. వారికి కనీస వేతనం 26,000 ప్రభుత్వం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
2019 ఎన్నికల సమయంలో అంగన్వాడీలకు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు జీతాలు పెంచుతానని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు జీతాలు పెంచకపోవడమే కాక అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు వారి న్యాయమైన సమస్యల కోసం సమ్మె నిర్వహిస్తుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొన్న జరిగిన బహిరంగ సభలో టిడిపి జనసేన పార్టీ 2024లో ఉమ్మడిగా ప్రభుత్వం చేపడుతుందని చేపట్టిన వెంటనే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పడం జరిగిందన్నారు. అంతేకాదు లోకల్ గా మీకు ఏ సమస్య వచ్చినా కూడా నేను ముందు ఉంటాను, నాకు మీ సమస్యను వెంటనే తెలియజేయండి అని మలిశెట్టి వెంకటరమణ అన్నారు. రాబోవు 2024 ఎన్నికలలో ప్రజలందరూ తగిన బుద్ధి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తారు. ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట తప్పను మడమ తిప్పను అన్న నినాదం చేసి ప్రతి సంస్థల ఉద్యోగులను ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. గత ఎన్నికల ముందు ఎన్నో చెప్పారు ఏ ఒక్క సమస్య పరిష్కరించడంలో విఫలమైందని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాల పాలనలో దోచుకోవడం దాచుకోవడం తప్ప అభివృద్ధి శూన్యమని మలిశెట్టి వెంకటరమణ ఎద్దేవాచేశారు. రాష్ట్రంలోని ఉద్యోగస్తులందరికీ ఎన్నో హామీలు ఇచ్చి మాట తప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు, జనసేన నాయకులు, ఆయాలు, తదితరులు పాల్గొన్నారు.