రామగుండం ఎన్ టి పి సి పరిశ్రమలో బూడిద రవాణా నిలిచిపోయింది. గత 14 రోజులుగా ట్రాన్స్ పోర్టు లారీ యజమానులు సమ్మె చేస్తున్నారు. ఈ క్రమంలో యజమానులు కాంటాక్ట్ తీసుకున్న వాహనాలను అనుమతించకపోవడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ఎన్టిపిసి పరిశ్రమలో బొగ్గును మండించడం ద్వారా వచ్చే బూడిదను కొందరు టెండర్ ద్వారా కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. దీంతో తమకు ఉపాధి లేకుండా పోయిందని యజమానులు సమ్మె బాట పట్టారు. ఎన్టిపిసి లో బూడిద రవాణాను తమకు అప్లై చేయించాలని, స్థానికులుగా తమకు హక్కు ఉందని వారి డిమాండ్ చేస్తున్నారు. అయితే యాజమాన్యం ససేమిరా అనడంతో వారు ఇతర ప్రాంతాలకు రవాణా చేసే వాహనాలను అడ్డుకున్నారు. దీంతో గత పది రోజులుగా ఎన్టిపిసి నుండి ఇతర ప్రాంతాలకు బూడిద రవాణా నిలిచిపోయింది. తమ హక్కులు సాధించేవరకు సమ్మె కొనసాగుతుందని లారీ యజమానులు అంటున్నారు.
నిలిచిపోయిన బూడిద రవాణా
65
previous post