బీజేపీ తరఫున రఘునందన్ రావు(Raghunandan Rao) నామినేషన్ దాఖలు..
తెలంగాణ(Telangana)లో నామినేషన్లు(Nominations) జోరందుకున్నాయి. మెదక్ పార్లమెంటు స్థానానికి బీజేపీ(BJP) తరఫున రఘునందన్ రావు నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం నుంచి ఆయన ఊరేగింపుగా వెళ్లారు. రిటర్నింగ్ అధికారి, మెదక్ జిల్లా కలెక్టర్ కూడా అయిన రాహుల్ రాజుకు తన అభ్యర్థిత్వ పత్రాలను అందజేశారు. ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ తన సత్తా నిరూపిస్తామని చెప్పారు. ప్రజలు సత్యం వైపు ఉండాలని కోరారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి