కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమను నిరాకరించిందన్న కారణంతో ఓ ప్రేమోన్మాది యువతి గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బొద్దుల సాయి అనే యువకుడు కొత్తపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానంటూ గత కొంతకాలంగా వెంటపడుతున్నాడు. ఈ క్రమంలో ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిందితుడు యువతిపై కత్తితో దాడి చేశాడు. ఆమె మెడపై తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలు కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అప్పటికే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. యువతిని వెంటనే కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఏసీపీ కరుణాకర్ రావు ఆమె చికిత్స తీసుకుంటున్న ఆస్పత్రికి వచ్చి స్టేట్మెంట్ రికార్డు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ప్రేమోన్మాది ఘాతుకం…యువతిపై కత్తి తో దాడి
112
previous post