లక్నో వేదికగా ముంబై ఇండియన్స్(Mumbai Indians) తో జరిగిన మ్యాచ్(Match)లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) సునాయాస విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. లక్నో బ్యాటర్లలో స్టొయినిస్ 62 పరుగులతో రాణించాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 28, దీపక్ హూడా 18 పరుగులతో పర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టగా.. తుషార, నబీ, కోయెట్జీ తలో వికెట్ తీశారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కి దిగిన ఎంఐ తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేసింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
నెహాల్ వధేరా 46, ఇషాన్ కిషన్ 32, టీమ్ డేవిడ్ 35 పరుగులు చేశారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా గోల్డెన్ డకౌట్ అయ్యాడు. రోహిత్ శర్మ 4, తిలక్ వర్మ 7, సూర్యకుమార్ యాదవ్ 10… స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. లక్నో బౌలర్లలో మోసిన్ ఖాన్ 2, నవీన్ ఉల్ హక్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, స్టొయినిస్ తలో వికెట్ పడగొట్టారు. లక్నో 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ విక్టరీలో కీలక పాత్ర పోషించిన స్టొయినిస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. పాయింట్ల పట్టికలో లక్నో మూడో స్థానానికి ఎగబాకింది. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ ఆశలు సంక్లిష్టం అయ్యాయి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- డొనాల్డ్ ట్రంప్ కు హష్ మనీ కేసులో ఎదురుదెబ్బఅమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు న్యూయార్క్ కోర్టు భారీ షాకిచ్చింది. హష్ మనీ కేసులో ఇప్పటికే ట్రంప్ ను దోషిగా తేల్చగా.. ఈ కేసు నుంచి రక్షణ కోరుతూ ట్రంప్ దాఖలు చేసిన పిటిషన్ ను…
- డే లైట్ సేవింగ్ టైమ్ ను రద్దు చేస్తాం – ట్రంప్అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు అసౌకర్యంగా మారిన డే లైట్ సేవింగ్ టైమ్ ను రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. డే లైట్ సేవింగ్ టైమ్ వల్ల అమెరికన్లపై చాలా భారం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.