శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని 11 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలలో పదోవరోజైన ఈ రోజు శ్రీస్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. శ్రీస్వామి వారి యగశాలలో చండిస్వారస్వామికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి అనంతరం పూర్ణాహుతి కలశోద్వాసన ,త్రిశూలస్నానం, జరిపారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేలాలు, పలు సుగంధ ద్రవ్యాలు, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగపూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనంతరం వసంతోత్సవం జరిపి వసంతోత్సవం తరువాత శ్రీచండీశ్వరస్వామిని పల్లకిలో ఆలయ మాడ వీధి గుండా ఆలయ పుష్కరిణి వద్ద తోడ్కొని వచ్చి చండీశ్వరస్వామికి వైదిక శాస్త్రంగా అవభృధస్నానం దేవస్థానం చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు, అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. శ్రీశైల క్షేత్రంలో రేపటితో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పూర్ణాహుతి…
86
previous post