శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని 11 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలలో పదోవరోజైన ఈ రోజు శ్రీస్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. శ్రీస్వామి వారి యగశాలలో చండిస్వారస్వామికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి అనంతరం పూర్ణాహుతి కలశోద్వాసన ,త్రిశూలస్నానం, జరిపారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేలాలు, పలు సుగంధ ద్రవ్యాలు, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగపూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనంతరం వసంతోత్సవం జరిపి వసంతోత్సవం తరువాత శ్రీచండీశ్వరస్వామిని పల్లకిలో ఆలయ మాడ వీధి గుండా ఆలయ పుష్కరిణి వద్ద తోడ్కొని వచ్చి చండీశ్వరస్వామికి వైదిక శాస్త్రంగా అవభృధస్నానం దేవస్థానం చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు, అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. శ్రీశైల క్షేత్రంలో రేపటితో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి.
Mahashivratri
పంచారామ క్షేత్రాల(Pancharama kshetras):
పంచారామ క్షేత్రాలలో ఒకటైన సోమారామం ప్రముఖ పుణ్యక్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా(West Godavari) భీమవరం గునుపూడి శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయం(Sri Someshwara Janardhana Swamy Temple)లో మహాశివరాత్రి(Mahashivratri) సందర్భంగా తెల్లవారుజాము నుండి భక్తులు పోటెత్తారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణ మంతా మారుమోగుతుంది అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు క్యూలైన్లలో స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. స్వామివారికి జగత్ జ్యోతి, అఖండ జ్యోతి, ఏకాదశ మహా రుద్రాభిషేకం, దివ్య అలంకారం, మహానివేదన, గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి కల్యాణం ఎంతో కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కల్యాణాన్ని తిలకించడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: బీరంగూడ దేవాలయంలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
Srisailam: శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి(Mahashivratri) బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలకు దేవస్థానం ఈవో పెద్దిరాజు దంపతులు,ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా సాయంత్రం ఆలయంలో బేరీ తాండవంతో సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ద్వజపటావిస్కరణ, అంకురార్పణ పూజలు నిర్వహించారు ముందుగా ఉత్సవ నిర్వాహకుడైన చండీశ్వరుడిని పల్లకిలో ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ చేసి ద్వజస్దంభం వద్దకు వైభవంగా తీసుకువచ్చారు వేద మంత్రోచ్ఛారణలతో అర్చకులు వేదపండితులు విశేష పూజలు నిర్వహించారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సకల దేవతలను ఆహ్వానించారు సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా వేదమంత్రోచ్ఛారణలతో ఆహ్వానించిన శివరాత్రి ఫెస్టివల్ ఆఫీసర్, దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు దంపతులు, ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు శివరాత్రి బ్రహ్మోత్సవాల ధ్వజపటన్ని ఆవిష్కరించారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
Mahashivratri :
దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ శైవ క్షేత్రంలో మహా శివరాత్రి జాతర నిర్వహణకు విస్తృతంగా ఏర్పాటు చేయాలని, ప్రణాళిక ప్రకారం నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వేములవాడలో మహాశివరాత్రి జాతర నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లను సిరిసిల్ల ఎస్పీ అఖీల్ మహజన్ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మార్చి 7 నుంచి మార్చి 9 వరకు 3 రోజుల పాటు మహా శివరాత్రి జాతర వేడుకలను అత్యంత వైభవోపేతంగా వేములవాడలో నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి సన్నద్ధమయ్యే విధంగా వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ మహాశివరాత్రి జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు ఆయా శాఖలకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించాలని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇబ్బందులు కలుగకుండ అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
3 షిఫ్టులలో పారిశుధ్య కార్మికులను నియమించి ఆలయ ప్రాంగణం, జాతర పరిసరాలను నిరంతరాయంగా శుభ్రం చేస్తూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పారిశుద్ధ్య కార్మికుల అటెండెన్స్ రెగ్యులర్ గా మానిటర్ చేసేందుకు సెక్టార్ వారీగా సంబంధిత అధికారులను నియమించాలని, మున్సిపల్, టెంపుల్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శుల ద్వారా పారిశుధ్య కార్యక్రమాలు పర్యవేక్షించాలని కలెక్టర్ పేర్కొన్నారు. త్రాగునీరు, మూత్రశాలలకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. జాతర సందర్భంగా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని వైద్యాధికారులు పారామెడికల్ సిబ్బంది అవసరమైన మందులతో అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
భక్తులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన మేర టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, దేవస్థానం క్యూలైన్లు పరిసర ప్రాంతాలలో రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేయాలని, మిషన్ భగీరథ ద్వారా భక్తులకు త్రాగునీటి వసతి కల్పించాలని, ప్రతి 100 మీటర్లకు త్రాగునీటి ట్యాపులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థ ఏర్పాటు చేయాలని, జాతర ప్రాంగణం మొత్తం సీసీ కెమెరాల ఆధీనంలో ఉండేలా చూడాలని, సీసీ కెమెరాలు పూర్తిస్థాయిలో పనిచేయాలని, అన్ని శాఖల అధికారులు సిబ్బంది సహాయ సహకారంతో విధులు నిర్వహించాలని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన మేర ఫ్లెక్సీ లు, సైన్ బోర్డులు, ఎంట్రీ, ఎక్సిట్ బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ మాట్లాడుతూ.. ఈ సారి భక్తుల రద్దీ పెరిగే నేపథ్యంలో అవసరమైన మేర తాత్కాలిక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని, క్యూలైన్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు, ఇబ్బందులు కలుగకుండ ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, పోలీస్ బందోబస్తు సిబ్బందికి అవసరమైన వసతి ఏర్పాటు చేయాలని, పార్కింగ్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ నియంత్రణకు జెసిబి, టోయింగ్ వాహనాలను సిద్ధం చేయాలని ఎస్పీ అన్నారు. ఈ పర్యటనలో వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారి, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి అన్సారీ, మున్సిపల్ కమీషనర్ అన్వేష్, ఆలయ ఈఈ రాజేష్, ఏఈఓ జయ కుమారి, టౌన్ సీఐ కరుణాకర్, ఆలయ సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.





Total views : 90126