చైనాకు మాల్దీవుల అధ్యక్షుడు విజ్ఞప్తి

China-maldive

Advertisements

&NewLine;<p>తమ దేశానికి మరింత మంది పర్యాటకులను పంపించాలని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు చైనాకు విజ్ఞప్తి చేశారు&period; చైనాలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఫుజియాన్ ప్రావిన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు&period; డ్రాగన్‌ను తమ సన్నిహిత మిత్రదేశాల్లో&comma; అభివృద్ధి భాగస్వాముల్లో ఒకటిగా పేర్కొన్నారు&period; భారత ప్రధాని మోదీ&comma; లక్షద్వీప్‌ పరిసరాలపై&period;&period; మాల్దీవుల మంత్రులు&comma; ఎంపీలు చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే&period; చైనా అధినేత జిన్‌పింగ్ ప్రారంభించిన &OpenCurlyQuote;బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ను ముయిజ్జు మరోసారి ప్రశంసించారు&period; తమ దేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అందించిందని చెప్పారు&period; మాల్దీవులకు చైనా పర్యాటకుల సంఖ్య పెంచాలని కోరారు&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;కొవిడ్‌కు ముందు మాకు చైనా నంబర్ వన్ మార్కెట్‌&period; ఈ స్థానాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నాలు తీవ్రతరం చేయాలి’’ అని అభ్యర్థించారు&period; మాల్దీవుల్లో సమీకృత పర్యాటక జోన్‌ను అభివృద్ధి చేసేందుకు రెండు దేశాలు 50 మిలియన్ల డాలర్ల ప్రాజెక్ట్‌పై సంతకం చేశాయని స్థానిక మీడియా తెలిపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్