కొత్త యాప్‌ లాంచ్.. స్మార్ట్‌వాచ్‌తో టీవీ, లైట్లను కంట్రోల్!

New app launch

Advertisements

&NewLine;<p>ఈ యాప్‌ను ఫిన్‌లాండ్‌కు చెందిన స్టార్టప్ డబుల్‌పాయింట్ డెవలప్ చేసింది&period; ఈ యాప్‌ను &OpenCurlyDoubleQuote;వావ్ మౌస్ ” అంటున్నారు&period; పేరు తగినట్లే ఇది మౌస్ లాగా పని చేస్తుంది&period; ఈ యాప్ ద్వారా స్మార్ట్‌వాచ్‌తో టీవీని ఆన్ చేయవచ్చు&period; నెట్‌ఫ్లిక్స్ కూడా కంట్రోల్ చేయవచ్చు లేదా సింపుల్ జెస్టర్స్‌తో&comma; కంటి కదలికలతో లైట్లను డిమ్ చేయవచ్చు&period; ఫోన్లు&comma; ట్యాబ్లెట్లు&comma; కంప్యూటర్లకు కూడా కనెక్ట్ అవుతుంది&period; లాస్ వెగాస్‌లో జరిగిన అతిపెద్ద టెక్ ఈవెంట్ కన్స్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్ లో ఈ యాప్‌ను డబుల్‌పాయింట్ సంస్థ ప్రదర్శించింది&period; డబుల్‌పాయింట్‌ టీమ్ CES అన్‌వీల్డ్‌లో రెండు డెమోలను చూపించింది&period; వాటిలో లైట్ కంట్రోల్ ఒకటి&period; యాప్ ఇన్‌స్టాల్ చేసిన వాచ్ ధరించినప్పుడు మణికట్టును లైట్ మీద అటూ ఇటూ తిప్పగానే&comma; ఆ లైట్ కాంతిని కంట్రోల్ చేసింది&period; లైట్ కంట్రోల్&comma; యూజర్ల కదలికల మధ్య ఫీడ్‌బ్యాక్‌లో దాదాపు ఎటువంటి ల్యాగ్ కనిపించలేదు&period; లైట్‌కు వాచ్ చూపగానే&comma; అది ఆన్ అయింది&comma; రిస్ట్ ఫ్లిక్‌తో ఆఫ్ అయింది&period; ఈ యాప్ ఆండ్రాయిడ్‌ వేర్ఓఎస్ స్మార్ట్‌వాచ్‌లపై పని చేస్తుంది&period; ఇల్లు లేదా ఆఫీస్‌లోని వివిధ డివైజ్‌లకు స్మార్ట్‌వాచ్‌ను కనెక్ట్ చేయడానికి యాప్ బ్లూటూత్‌పై ఆధారపడుతుంది&period; కనెక్ట్ చేశాక&comma; కమాండ్స్ ఇవ్వడానికి వేలితో నొక్కాలి లేదా మణికట్టు తిప్పడం వంటి ఫీచర్లు ఉపయోగించవచ్చు&period; స్క్రీన్‌పై వర్చువల్ కర్సర్‌ను మూవ్ చేయడానికి ఐ ట్రాకింగ్‌ని కూడా ఉపయోగించవచ్చు&period; ఇన్ని అదిరిపోయే ఫీచర్లు అందిస్తున్న ఈ యాప్‌కు మీడియా నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.