64
ఏ లక్ష్య సాధన కోసం అమరవీరులు అయ్యారో… వారి ఆశయంతోటి, ఆలోచనతోటి తెలంగాణలో అన్ని వర్గాలకు సంతోషం ఉండాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి, అవినీతి రహితంగా ఉండాలని ప్రజులు కోరుకున్నారో… దానికి భిన్నంగా, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా గడిచిన తొమ్మిదిన్నర ఏళ్ళల్లో పరిపాలనా జరిగిందని ఆరోపించారు జూపల్లి కృష్ణారావు. నూతన సచివాలయంలో జూపల్లి కృష్ణారావు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలతో జూపల్లిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.