కాకినాడ రూరల్ గంగనాపల్లి గ్రామంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ ఆధ్వర్యంలో సుమారుగా 200 మంది వైసీపీ పార్టీ కు చెందిన కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. పంతం నానాజీ జనాసేన పార్టీ కండువాలు వేసి జనసేన పార్టీలో ఆహ్వానించారు. పంతం నానాజీ, తెలుగుదేశం పార్టీ నాయకులు చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైసిపి పార్టీ మీద ప్రజలకు నమ్మకం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వలనే రాష్ట్రంలో సంక్షేమం ,సుపరిపాలన సాధ్యమని ప్రజలు గ్రహించారు అని అన్నారు. ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్ది వైసీపీ ప్రభుత్వం ఖాళీ అవటం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు కర్రేడ్ల గోవింద్, తడాల అబ్బు, కుర్ర నాగేశ్వరరావు, పుల్ల శ్రీరాములు, మాదరపు తాతాజీ, సిరంగు శ్రీనివాసరావు, తాటికాయలు వీరబాబు, సోదే ముసలయ్య జనసేన కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
జనసేన పార్టీలోకి భారీ చేరికలు…
101