గుoటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారి గణియా, IAS, ఈరోజు మంగళగిరి (Mangalagiri) పట్టణం లో కొన్ని MDU వాహనముల(MDU Vehicles)ను తనిఖీ చేసి ప్రజా పంపిణి వ్యవస్థ ద్వారా పంపిణి చేయుచున్న సరుకులను పరిశీలించిచారు. ఈ క్రమములో కార్డుదారులని సరుకుల నాణ్యత మరియు తూకము గురించి అడిగి తెలుసుకున్నారు. వాహనము ఆపరేటర్ పనితీరు గురించి తెలిసికొని సంతృప్తి వ్యక్తం చేసినారు. మరీ ముఖ్యంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుసరించి వాహనాలపై ఎలాంటి రాజకీయ నేతల ఫొటోలు ఉండకూడదని, వాహనాల వాలంటీర్లు ఉండకూడదని, వారి ద్వారా కార్డు దారులకు నిత్యావసర సరుకుల పంపిణి గురించి ఏటువంటి సమాచారం చేరవేయరాదని తెలిపారు.
అలాగే MDU వాహనదారులు, రేషన్ షాప్ డీలర్లు ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళకూడదని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు తీసుకోనబడతాయని తెలిపినారు. వేసవికాలం తీవ్రమైన ఎండలు ఉన్నందున, ఉదయాన్నే త్వరగా పంపిణి ప్రారంభించి, త్వరగా ముగించి, మరల సాయంత్రం చల్లబడిన తర్వాత ఎక్కువ సమయం పంపిణి చేసే లాగా చూసుకోమని MDU వాహనదారులని ఆదేశించారు. తనిఖీలలో జిల్లా పౌరసరఫరాల అధికారి కోమలి పద్మ, ఉప తహసీల్దార్ దుర్గరావు తదితరులు పాల్గొన్నారు.
ఇది చదవండి: కరీంనగర్ కమీషనరేట్ లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సేవలు ప్రారంభం..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి