130
Medaram Jathara News:
తెలంగాణ కుంభమేళగా పిలువబడే మేడారం సమ్మక్క సారక్క జాతర(Medaram Jathara)ను పురస్కరించుకొని కేంద్రం జాతరకు వెళ్లే భక్తుల సౌకార్యార్ధం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు ఈ రోజు కాగజ్ నగర్ నుంచి ప్రారంభమైంది. సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి వరంగల్ వరకు వెళ్లేందుకు గాను ఈ నెల 21 వ తేదీ నుంచి 24 వ తేదీ వరకు నాలుగు రోజులపాటు ఈ రైలు నడవనున్నట్టు రైల్వే అదికారులు తెలిపారు. మొదటి రోజు ప్రత్యేక రైలు ఏర్పాటు చెయ్యడంతో మేడారం జాతరకు వెళ్లే భక్తులతో కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ కిటకిటలాడింది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.