పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయం (Municipality Office)లో మంథని పుర పాలక సంఘం చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ల ఎన్నికకై సోమవారం ఆర్డీఓ హనుమ నాయక్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ మేరకు హాజరైన కౌన్సిలర్ లు మున్సిపల్ చైర్ పర్సన్ గా పెండ్రు రమాదేవి, వైస్ చైర్ పర్సన్ గా శ్రీపతి బానయ్య లను ఏక్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ లతో ఆర్డీవో హనుమా నాయక్ పదవీ ప్రమాణ స్వీకారం చేయించి, వారికి ధృవపత్రాలను అందజేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సందర్భంగా చైర్ పర్సన్ పేండ్రి రమాదేవి మాట్లాడుతూ… తెలంగాణ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంథని పట్టణాన్ని అభివృద్ధి దిశగా పని చేస్తామని అన్నారు. వైస్ చైర్ పర్సన్ శ్రీపతి బానయ్య మాట్లాడుతూ రాక్షస పాలన అంతం అయ్యిందని, కష్టానికి ఫలితం కాంగ్రెస్ పార్టీ వల్ల దక్కిందని రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు, దుద్దిల్ల శ్రీను బాబు కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ప్రత్యేక సమావేశానికి కౌన్సిల్ సభ్యులు గుండా విజయ లక్ష్మి, కుర్ర లింగయ్య, నక్క నాగేంద్ర, కొట్టే పద్మ, చొప్పకట్ల హనుమంతరావు, వడ్లకొండ రవి, వేముల లక్ష్మి హాజరయ్యారు.
ఇది చదవండి: ప్రజాగళం సభ లో జీవీ సంచలన వ్యాఖ్యలు..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి