తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. 11 వేల 62 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందులో 2 వేల 629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 727 లాంగ్వేజ్ పండిట్ పోస్టులు, 182 పీఈటీ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇక 6 వేల 508 ఎస్జీటీ పోస్టులు, 220 స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. 769 ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. గత ప్రభుత్వ రిలీజ్ చేసిన 5 వేల 89 పోస్టులతో పాటు కొత్తగా 5 వేల 973 పోస్టులను కలిపి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కాగా మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆన్లైన్ పద్ధతితో పరీక్ష నిర్వహించనున్నారు. అయితే గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరంలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల…
93
previous post