మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సినిమా పరిశ్రమ గురించి తనను అడిగారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను చిరంజీవి పరామర్శించారు. తాను కేసీఆర్‌ను పరామర్శించానని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, హుషారుగా ఉన్నారని తెలిపారు. ఆరు వారాల్లోగా ఆయన కోలుకోవచ్చునని వైద్యులు చెప్పారన్నారు. సర్జరీ తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే ఆయన నడిచేలా వైద్యులు చూసుకున్నారన్నారు. కేసీఆర్ సాధ్యమైనంత త్వరగా కోలుకొని సాధారణ జీవితం ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్.. తనను సినిమా పరిశ్రమ గురించి అడిగినట్లు చెప్పారు. సినిమాలు ఎలా ఆడుతున్నాయి? ఇండస్ట్రీ ఎలా ఉంది? అని కేసీఆర్ అడిగినట్లు చెప్పారు. ఆసుపత్రిలోనే ఉన్న కేటీఆర్ భుజాలపై చేతులు వేసి ఆప్యాయంగా పలకరించారు. ఎదురుగా కనిపించిన కవితకు నమస్కరించారు. కేటీఆర్ ఆయనను లోనికి తీసుకువెళ్లారు.
కేసీఆర్‌ను పరామర్శించిన మెగాస్టార్….
76
previous post