ప్రభుత్వపరం కానున్న హైదరాబాద్ మెట్రో..

Advertisements

<p>హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టు పూర్తిగా ప్రభుత్వపరం కానుంది&period; ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ తుది దశకు చేరుకుంది&period; ఇందుకు సంబంధించి వాటా కొనుగోలు ఒప్పందంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి&comma; ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్&period;ఎన్&period;సుబ్రమణ్యం సమక్షంలో సంతకాలు జరగనున్నాయి&period; నిన్న సీఎస్‌ రామకృష్ణారావు అధ్యక్షతన సమావేశమైన HMRL బోర్డు&period;&period; ఈ స్వాధీన ప్రక్రియకు ఆమోదముద్ర వేసింది&period; ఒప్పందంపై సంతకాల కోసం ఎల్ అండ్ టీ ఛైర్మన్ హైదరాబాద్ పర్యటన కూడా ఖరారైంది&period; రేపటితో గడువు ముగియనుండటంతో అధికారులు ఒప్పంద పత్రాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు&period;<&sol;p>&NewLine;<p>ఈ ఒప్పందం ప్రకారం ఎల్ అండ్ టీ మెట్రోరైలు లిమిటెడ్‌కు ఉన్న రూ&period;13&comma;615 కోట్ల అప్పును ప్రభుత్వం టేకోవర్ చేస్తుంది&period; ఈ మొత్తాన్ని ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ &lpar;IRFC&rpar; నుంచి తక్కువ వడ్డీకి రుణంగా తీసుకుని రీషెడ్యూల్ చేయనుంది&period; దీంతో పాటు హెచ్‌ఎండీఏ నుంచి రూ&period;1&comma;385 కోట్లను ఈక్విటీగా ఎల్ అండ్ టీకి చెల్లించనుంది&period; వాస్తవానికి మార్చి 31 నాటికే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నా&comma; IRFC నుంచి రుణం మంజూరు ఆలస్యం కావడంతో గడువును ఏప్రిల్ 30కి పొడిగించారు&period; ఈ నేపథ్యంలో ఇవాళో&period;&period;రేపో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి&period; ఈ ఒప్పందంతో మెట్రో మొదటి దశలో పీపీపీ విధానం ముగిసి&comma; అది ప్రభుత్వ ఆస్తిగా మారనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…

జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..