జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని గడి బురుజు వద్ద గల సూపియాన్ కట్టే మిషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంబవించింది. తెల్లవారుజామున ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దుకాణంలో కర్రలు పెద్ద ఎత్తున నిలువ ఉండడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. జనావాసాల మధ్యనే కట్టే మిషన్ దుకాణం ఉండడంతో ఎగిసిపడుతున్న మంటలను చూసి చుట్టుపక్కల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటివరకు ఎగిసిపడిన మంటలు కాస్త తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది .కాలిపోయిన కర్ర విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని స్థానికులు అంటున్నారు.
జగిత్యాలలో అర్ధరాత్రి చెలరేగిన మంటలు..
74
previous post