80
హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మాత్యులు పొన్నం ప్రభాకర్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. మంత్రి పొన్నం రోగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, ఆసుపత్రి అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులను కలియదిరిగారు. రోగులకు అందిస్తున్న సేవలు, ఇతర సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. మందులు, ఆహారం అందుబాటులోనే ఉన్నాయా? అని ఆరా తీశారు. అన్నీ సక్రమంగా అందుతున్నాయని రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. దవాఖానాలో రోగులకు అందిస్తున్న సేవలపై మంత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.