ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా

Ramakrishna Reddy

Advertisements

&NewLine;<p>మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు&period; అదేవిధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేసినట్లు తెలిపారు&period; ఎమ్మెల్యే పదవికి స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేసిన ఆర్కే స్పీకర్‌ కార్యాలయానికి వెళ్లి సభాపతి కార్యదర్శికి ఆ లేఖను అందజేశారు&period; మంగళగిరి వైసిపి ఇన్‌ఛార్జ్‌గా గంజి చిరంజీవికి ఆ పార్టీ బాధ్యతలు అప్పగించింది&period; ఈ నేపథ్యంలోనే ఆర్కే అసంతృప్తికి గురై రాజీనామా చేసినట్లు తెలుస్తోంది&period; రాజీనామా అనంతరం ఆర్కే మాట్లాడుతూ ఎమ్మెల్యే పదవికి&comma; వైసిపికి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశానని తెలిపారు&period; స్పీకర్‌ కార్యాలయంలో రాజీనామా లేఖను అందజేశానని దీన్ని ఆమోదించాలని స్పీకర్‌ను కోరినట్లు తెలిపారు&period; రాజీనామాకు గల కారణాలను త్వరలో తెలియజేస్తానని ఆర్కే తెలిపారు&period; అయితే&comma; అనూహ్యంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.