పల్నాడు జిల్లా, గురజాల వైసీపీలో అసమ్మతి సెగ, జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో 2024 లో గురజాల నియోజకవర్గంలో నేను పోటీ చేస్తున్న- ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, పల్నాడు జిల్లా మాచవరం పల్నాడు బలహీన వర్గాల ఐక్యవేదిక సభలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి హాట్ కామెంట్స్, జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో 2024 లో గురజాల నియోజకవర్గంలో నేను పోటీ చేస్తున్న, శాసనమండలి విప్పుగా పదవి వస్తే అభినందన సభకు కూడా జనాన్ని రానీయకుండా అడ్డుకున్నారు. ఇంకా ఎన్నాళ్లు మీ అరాచకాలు, నియోజకవర్గంలో నా అభిమానులకు ఏ ఆఫీసులకు వెళ్లిన పని చేయొద్దని అధికారులను ఆదేశించారు. ఎవరు జండా పట్టని టైంలో వైసీపీ జెండాను భుజాన వేసుకొని మోసాను ఎన్నో కష్టాలను ఎదుర్కొని పార్టీ అధికారంలో రావటానికి కృషి చేశాను. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు బ్రహ్మరథం పడుతుంటే గురజాలలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. మండలానికి ఇద్దరు ముగ్గురు మాత్రమే పెత్తనం చెలాయించి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకుంటున్నారు. ఇక మీ ఆటలు సాగనివ్వం ఎమ్మెల్సీ జంగా పల్లకి మోసేది మేము పెత్తనం మరొకరిదా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పల్లకి మోసేది మేము పెత్తనం మరొకరిదా..? ఎమ్మెల్సీ జంగా
106
previous post