ప్రపంచ దేశాలు భారత్ ను నమ్మకమైన భాగస్వామిగా చూస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్లో ఆయన ప్రసంగించారు. రాబోయే రోజుల్లో టాప్-3 ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్ ఐదో ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది. పదేళ్ల క్రితం 11వ స్థానంలో ఉంది. అన్ని పరిశోధనా సంస్థలూ భారత్ మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా వేస్తున్నాయి. ఇది తప్పకుండా జరుగుతుంది అని హామీ ఇస్తున్నా అని చెప్పారు. గ్లోబల్ ఎకానమీలో, పరిష్కారాలను కనుగొనే సాంకేతిక కేంద్రంగా భారత్ ఉందని వెల్లడించారు. వచ్చే 25 ఏళ్ల లక్ష్యం దిశగా భారత్ పని చేస్తోందన్నారు. 100 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలు జరుపుకునే సమయానికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యం మాకు ఉంది. కాబట్టి ఈ 25 ఏళ్లు భారత్కు ఎంతో ముఖ్యం అని చెప్పారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్లాలని సూచించారు.
వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొన్న మోడీ…
76
previous post