భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. దేశంలో ఎలాంటి విరామం లేకుండా సుదీర్ఘకాలం ప్రభుత్వ అధిపతిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. 8 వేల 931 రోజులుగా ఆయన పాలకుడి హోదాలో ఉన్నారు. ఇందులో గుజరాత్ సీఎంగా పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. నిన్నటి వరకు ఈ రికార్డు సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉండేది. 2001 లో గుజరాత్ మఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ… వరుసగా 13 ఏళ్లు అదే పదవిలో ఉన్నారు. ఆ తర్వాత 2014 లో అనూహ్యంగా బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నికైన ఆయన… అఖండ విజయం సాధించారు. అప్పటి నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రి కూడా మోదీనే కావడం విశేషం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జన్మించి, ఎక్కువకాలం ప్రధానిగా ఉన్న తొలి కాంగ్రెసేతర నేత కూడా మోదీయే. అలాగే ఈ దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన వ్యక్తుల్లో మోదీ రెండో స్థానంలో ఉన్నారు.
PM
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్థానిక భారత రాయబార కార్యాలయం సమన్వయం లేకుండా సరిహద్దులు దాటి ఇతర దేశాలకు వెళ్లే ప్రయత్నం చేయవద్దని ఇరాన్‌లోని భారతీయులకు సూచించింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ కీలక సూచనలు చేసింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటివరకు 550 మంది భారతీయులు భూభాగ సరిహద్దుల ద్వారా ఇరాన్ నుంచి ఆర్మేనియా చేరుకున్నారని, మరో 90 మంది భారతీయులు అజర్‌బైజాన్‌కు తరలివెళ్లారని వెల్లడించారు.
తీర్థయాత్ర కోసం ఇరాన్ వెళ్లిన 284 మంది భారతీయులలో కొందరు ఇప్పటికే స్వదేశానికి చేరుకోగా, మిగిలిన వారు త్వరలోనే రానున్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులను ముందస్తు జాగ్రత్తగా నగర శివార్లలోని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం పూర్తిస్థాయిలో పనిచేస్తోందని, క్షేత్రస్థాయిలో భారతీయులకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తోందని స్పష్టం చేసింది. హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని అధికారులు తెలిపారు.
గల్ఫ్ దేశాల నుంచి భారతీయుల తరలింపు ముమ్మరంగా సాగుతోందని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 2 లక్షల 20 వేల మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్లు వెల్లడించారు. యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్ వంటి దేశాల నుంచి భారత్‌కు 45 విమానాలను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఖతార్ తన గగనతలాన్ని పాక్షికంగా తెరవడంతో అక్కడి నుంచి విమానాలు నడుస్తున్నాయని వెల్లడించారు. కువైట్ గగనతలం ఇంకా మూసివేసే ఉండటంతో, త్వరలోనే ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. బహ్రెయిన్, ఇరాక్ ప్రజలకు సౌదీ అరేబియా మీదుగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు.
కేరళ పేరును “కేరళం”గా మార్చడానికి కేంద్రం ఆమోదం తెలపడం ద్వారా రాష్ట్ర ప్రజల దీర్ఘకాల డిమాండ్ నెరవేరిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.కేరళలోని ఎర్నాకుళంలో దాదాపు రూ.10,800 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు . జూన్ 2024లో కేరళ శాసనసభ ఈ మార్పును కోరుతూ ఆమోదించిన తీర్మానాన్ని అనుసరించి, ఫిబ్రవరి 24న కేంద్ర మంత్రివర్గం రాష్ట్రం పేరును “కేరళం”గా మార్చే ప్రతిపాదనను ఆమోదించింది. కొచ్చిలో జరిగిన అఖిల కేరళ ధీవర సభ స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, మలయాళీ సంస్కృతి మరియు గుర్తింపుకు అనుగుణంగా రాష్ట్రానికి ఇప్పుడు సరైన పేరు వచ్చిందని అన్నారు. ఈ సంధర్భంగా షోరనూర్-నిలంబూర్ రోడ్ రైల్వే లైన్ విద్యుదీకరణ ప్రాజెక్టును కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. ఈ ముఖ్యమైన రైలు విభాగం విద్యుదీకరణ వల్ల షోరనూర్‌లో లోకోమోటివ్ మార్పుల అవసరాన్ని తొలగించడం ద్వారా వేగవంతమైన, మరింత సమర్థవంతమైన ,స్థిరమైన రైలు కార్యకలాపాలు సాధ్యమవుతాయి. కేరళ, తమిళనాడు మధ్య రైలు కనెక్టివిటీని బలోపేతం చేస్తూ పాలక్కాడ్, పొల్లాచి మధ్య కొత్త రైలు సర్వీసును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సర్వీసు రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రోజువారీ ప్రయాణికులు, యాత్రికులు, వ్యాపారులు, పర్యాటకులకు ప్రయోజనం చేకూరుస్తుంది.భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కొచ్చి రిఫైనరీలో పాలీప్రొఫైలిన్ యూనిట్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ.8.80 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. జల్‌జీవన్ మిషన్ విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2028 డిసెంబర్ వరకు జల్‌జీవన్ మిషన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని మదురై ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. దాంతో పాటు కేబినెట్ భేటీలో ప్రధానంగా మధ్య ప్రాచ్యంలో యుద్ధం ప్రభావం భారత్‌పై ఎంత మేరకు పడుతుందన్న దానిపై చర్చించారు. తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను గురించి కూడా చర్చించారు.
ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. కేబినెట్ సమావేశంలో తమిళనాడు అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, పారిశ్రామికాభివృద్ధి మరియు సంక్షేమ పథకాల అమలుపై కేంద్రం వరాల జల్లు కురిపించినట్లు తెలుస్తోంది. తమిళనాడులో అడ్వాంటేజ్ పొందేందుకు కేంద్రం ఒకవైపు అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూనే, మరోవైపు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చేరువయ్యేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు, పీఎం ఉజ్వల గ్యాస్ కనెక్షన్ల పంపిణీ ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని కేంద్రం భావిస్తోంది. మార్చి 11న ప్రధాని మోడీ తమిళనాడు పర్యటన సందర్భంగా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటనలు మరియు ప్రారంభోత్సవాలు ఉండనున్నాయి.
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతున్న వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గల్ఫ్ దేశాల అధినేతలతో ఫోన్ లో…
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతున్న వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గల్ఫ్ దేశాల అధినేతలతో ఫోన్ లో మంతనాలు జరిపారు. అక్కడి భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూనే.. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించారు. భారతీయులకు రక్షణ కల్పించాలన్నారు. సురక్షితంగా భారత్ కు పంపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయా దేశాధినేతలకు ఫోన్ చేసి దాడుల వివరాలు కనుక్కున్నారు. సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ సల్మాన్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో కూడా మాట్లాడారు. ఆ దేశాల్లోని భారతీయుల భద్రతపై వారితో చర్చించారు. సౌదీ అరేబియా, బహ్రెయిన్ల నాయకులతో చర్చల సందర్భంగా ఆ దేశాలపై ఇరాన్ దాడులను మోదీ ఖండించారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి గల్ఫ్ దేశాల నాయకులతో ప్రధాని మోదీ నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో ఫోన్లో మాట్లాడారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్తో కూడా మాట్లాడారు. భారతీయుల క్షేమం కోసం కృషి చేస్తున్నందుకు ఆల్ నహ్యాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గల్ఫ్ దేశాల్లోని పరిస్థితిని సమీక్షించడానికి ప్రధానమంత్రి భద్రతా కేబినెట్ కమిటీ యూఏఈలో ఉన్న భారతీయ భద్రతపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది..
ప్రపంచ దేశాలు భారత్ ను నమ్మకమైన భాగస్వామిగా చూస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో ఆయన ప్రసంగించారు. రాబోయే రోజుల్లో టాప్-3 ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్ ఐదో ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది. పదేళ్ల క్రితం 11వ స్థానంలో ఉంది. అన్ని పరిశోధనా సంస్థలూ భారత్ మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా వేస్తున్నాయి. ఇది తప్పకుండా జరుగుతుంది అని హామీ ఇస్తున్నా అని చెప్పారు. గ్లోబల్ ఎకానమీలో, పరిష్కారాలను కనుగొనే సాంకేతిక కేంద్రంగా భారత్ ఉందని వెల్లడించారు. వచ్చే 25 ఏళ్ల లక్ష్యం దిశగా భారత్ పని చేస్తోందన్నారు. 100 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలు జరుపుకునే సమయానికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యం మాకు ఉంది. కాబట్టి ఈ 25 ఏళ్లు భారత్‌కు ఎంతో ముఖ్యం అని చెప్పారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్లాలని సూచించారు.






Total views : 81430