129
భారత ప్రధాని నరేంద్ర మోదీ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో మహాద్వారం ద్వారా ఆయన ఆలయంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ప్రధానికి టీటీడీ ఛైర్మన్, ఈవో, అర్చకులు స్వాగతం పలికారు. ఆలయంలోకి ప్రవేశించిన ప్రధాని ధ్వజ స్తంభానికి మొక్కారు. అనంతరం మూలవిరాట్టును దర్శించుకున్నారు. ఆ తర్వాత హుండీలో కానుకలను సమర్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం పలికారు. శేషవస్త్రాన్ని అందజేశారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి స్వామివారి చిత్ర పటం, డైరీ, క్యాలండర్ లను అందించారు. ప్రధాని మోదీ ఆలయంలోనే దాదాపు 50 నిమిషాలు గడిపారు.
Read Also..
Read Also..