అంగన్వాడి సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా మూడవ రోజు ఉలవపాడు ప్రాజెక్టు ఆఫీస్ వద్ద అంగన్వాడీల ఆందోళన జరిగింది. ఈ ఆందోళనకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది అంగన్వాడీలు నెలరోజుల ముందునుండి, తమ సమస్యలు పరిష్కారం చేయాలని, ప్రభుత్వానికి నోటీసు ఇస్తే పరిష్కారం చెయ్యకుండా, మీరు సెంటర్లు తెరవకపోతే ఉద్యోగం నుండి తొలగిస్తామని బెదిరించడం సరైనది కాదని జి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. తెలంగాణ కన్నా అదనంగా వేతనం పెంచుతామని హామీ ఇచ్చారు కానీ, ఇచ్చిన హమీ నెరవేర్చకుండా, మాట తప్పిన ముఖ్యమంత్రిగా చిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన అన్నారు.
కనీస వేతనం రూ 26 వేలు ఇవ్వా లని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలుగా ఇవ్వాలని, జీతంలో సగభాగం పెన్షన్ గా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ.పీ.అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) ఉలవపాడు ప్రాజెక్టు అధ్యక్షురాలు సిహెచ్ ఇందిరావతి, ఉలవపాడు మండల సీఐటీయూ అధ్యక్షులు వాకా లతారెడ్డీ, గుడ్లూరు మండల అధ్యక్షులు ఎస్.కే పద్మజ, లింగసముద్రము నేత కే.సుగుణ, అంగన్వాడీ నాయకులు కత్తి బుజ్జమ్మ, కృష్ణ కుమారి, గీత, పద్మజ, అమిరున్నీసా, పద్మ, కామాక్షి తదితరులు పాల్గొన్నారు.
బెదిరించి ఉద్యమాన్ని ఆపలేరు….
77
previous post