సింగరేణి సంస్థను ప్రైవేటుపరం కాకుండా చూస్తామని అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అండర్ గ్రౌండ్ మైనింగ్ గనులను ఏర్పాటు చేస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎం ఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా ఓసిపి త్రీ కృషి భవన్ లో ఐఎన్ టియూసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ. కేసీఆర్ ప్రభుత్వం సింగరేణి సంస్థ ను అప్పుల పాలు చేసిందని, రామగుండం ప్రాంతాన్ని బొందల గడ్డగా మార్చారాని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుతో పాటు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అలాగే కార్మికుల సొంతింటి కల అమలు కోసం కృషి చేస్తామని, కోల్ బెల్ట్ ప్రాంతంలో సిమెంట్ కర్మాగారాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తన గెలుపుకు సహకరించిన కార్మిక వర్గానికి నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటానని పేర్కొన్నారు.
ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటా- ఎమ్మెల్యే ఎం ఎస్ రాజ్ ఠాకూర్
93
previous post