హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య కు వారం రోజులలో రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య ఉదయం విధులకు హాజరు కావడానికి మున్సిపల్ కార్యాలయానికి తన ఎర్టీగా కారులో వస్తుండగా హుజురాబాద్ వరంగల్ ప్రధాన రహదారిపై కేసి క్యాంపు వద్ద ద్విచక్ర వాహనాని మున్సిపల్ కమిషనర్ కారు వెనక నుండి ఢీకొంది. ద్విచక్ర వాహనం పై ముగ్గురు యువకులు హుజూరాబాద్ వైపు వస్తుండగా కారు ఢీకొని ముగ్గురికి స్వల్పగాయాలు, గాయాలైనవారిని వెంటనే 108 వాహనంలో మున్సిపల్ కమిషనర్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. గత వారం రోజుల క్రితం మున్సిపల్ కమిషనర్ తన పని నిమిత్తం కరీంనగర్ కు వెళుతుండగా శంకరపట్నం మండలం కొత్త గట్టు గ్రామము వద్ద కారు అదుపు తప్పి రోడ్డు పక్కనేవున్న వ్యవసాయ పొలం లోకి దూసుకెళ్లింది. ప్రమాదం నుంచి కమిషనర్ ప్రాణాలతో బయటపడ్డారు.
రోడ్డు ప్రమాదాల నుండి బయటపడ్డ కమిషనర్…
88
previous post