నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఆవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలం తాడేపల్లి గ్రామంలో భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ వార్త విని బాధతో మరణించిన కొడాలి సుధాకర్ రావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. సుధాకర్ రావు చిత్రపటానికి నివాళులర్పించారు భువనేశ్వరి. చంద్రబాబు భరోసా పత్రాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. ఎన్టీ రామారావు పేద ప్రజల కోసం చేసినట్లే… చంద్రబాబు కూడా పేద ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని అన్నారు. చంద్రబాబు విజన్ 20-20 అన్నప్పుడు కొందరు విమర్శించారని, కానీ ఇప్పుడు ఆయన కట్టిన ఐటి కంపెనీలు లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయని అన్నారు. ఐటి శాఖ మంత్రిగా లోకేష్ ఉన్నప్పుడు అనేక కంపెనీలు తీసుకువచ్చాడని, కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే బాధ కలుగుతోందని భువనేశ్వరి తెలిపారు.
నారా భువనేశ్వరి కృష్ణా జిల్లా పర్యటన…
88
previous post