ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా హిందూపురంలో జరిగే శంఖారావం యాత్రకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి ఎయిర్పోర్ట్ లో ఘనస్వాగతం పలికిన ఉమ్మడి జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు నారా లోకేష్ వెంట పుట్టపర్తి ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గాన హిందూపురంకి చేరుకున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ప్రముఖ ప్రసిద్ధి సూగూరు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నారా లోకేష్. వేద పండితుల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. హిందూపురంలో నారా లోకేష్ కి అడగడగున ప్రజలు బ్రహ్మరథం పట్టి స్వాగతం పలికారు. గురువారం ఉదయం 10 గంటలకు హిందూపురం పట్టణం కొల్లకుంట గ్రామంలో జరిగే శంఖారావం యాత్రలో నారా లోకేష్ పాల్గొని ప్రసంగించనున్నారు. పార్టీ క్యాడర్ ను, నేతలను సమాయత్తం చేయడమే లక్ష్యంగా ఈ యాత్ర చేపట్టారు నారా లోకేష్. కార్యకర్తలు, నాయకులతో సమావేశమై టిడిపి అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నాము అనే అంశాలపై వివరించనున్నారు.
హిందూపురం శంఖారావం యాత్రకు విచ్చేసిన లోకేష్…
90
previous post