ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా హిందూపురంలో జరిగే శంఖారావం యాత్రకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి ఎయిర్పోర్ట్ లో ఘనస్వాగతం పలికిన ఉమ్మడి జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు నారా లోకేష్ వెంట పుట్టపర్తి ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గాన హిందూపురంకి చేరుకున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ప్రముఖ ప్రసిద్ధి సూగూరు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నారా లోకేష్. వేద పండితుల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. హిందూపురంలో నారా లోకేష్ కి అడగడగున ప్రజలు బ్రహ్మరథం పట్టి స్వాగతం పలికారు. గురువారం ఉదయం 10 గంటలకు హిందూపురం పట్టణం కొల్లకుంట గ్రామంలో జరిగే శంఖారావం యాత్రలో నారా లోకేష్ పాల్గొని ప్రసంగించనున్నారు. పార్టీ క్యాడర్ ను, నేతలను సమాయత్తం చేయడమే లక్ష్యంగా ఈ యాత్ర చేపట్టారు నారా లోకేష్. కార్యకర్తలు, నాయకులతో సమావేశమై టిడిపి అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నాము అనే అంశాలపై వివరించనున్నారు.
Sankaravam
తెలుగుదేశం పాలనలో ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే.. జగన్ అధికారంలోకి వచ్చాక గంజాయి క్యాపిటల్ గా మార్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా ఎన్నికల ముందు కొత్త నాటకానికి తెరతీశారని మండిపడ్డారు. మోసం, దగా, కుట్రలకు ప్యాంటూ షర్టు తొడిగితే జగన్ లా ఉంటుందంటూ తీవ్ర విమర్శలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ‘శంఖారావం’ యాత్రను లోకేశ్ ప్రారంభించారు.అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అమ్మలాంటిదని, అమ్మప్రేమకు ఎలా కండిషన్స్ ఉండవో.. ఇక్కడి ప్రజలు కూడా అంతేనని చెప్పారు. పౌరుషాలు, పోరాటాలకు మారుపేరు శ్రీకాకుళం జిల్లా అని అన్నారు. గరిమెళ్ల సత్యనారాయణ, గౌతు లచ్చన్న, ఎర్రన్నాయుడు పుట్టిన గడ్డ ఇది.. ఇలాంటి ప్రాంతంలో ‘శంఖారావం’ యాత్ర ప్రారంభిస్తుండటం అదృష్టంగా భావిస్తున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు. Read Also..





Total views : 141141