83
పార్లమెంటు ఎన్నికల్లో 370 సీట్లను బీజేపీ గెలుస్తుందని ప్రధాని మోదీ లోక్ సభలో ప్రకటించారు. ఇదే టార్గెట్ తో బీజేపీ లోక్ సభ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. తెలంగాణలో సైతం మొత్తం 17 సీట్లను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించబోతున్నారు. మార్చి 4, 5 తేదీల్లో రెండు రోజులపాటు ఆయన పర్యటన కొనసాగనుంది. ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మోదీ పర్యటిస్తారు. వాస్తవానికి మార్చి 4వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. అయితే మోదీ పర్యటన నేపథ్యంలో ఆయన పర్యటన రద్దయింది.