Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Devotional శ్రీరామ నవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు…

శ్రీరామ నవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు…

by Prakash
Sri Rama Navami Tiru Kalyana Brahmotsavam

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి నాడు నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణ ముహూర్తాన్ని వైదిక కమిటీ నిర్ణయించింది. భద్రాద్రిలో స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోది నామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి మంగళవారం నుంచి చైత్ర శుద్ధ పూర్ణిమ మంగళవారం వరకూ, అనగా ఏప్రిల్ 9 వ తేదీ నుండి 23వ తేదీ వరకూ భద్రాద్రిలో శ్రీస్వామి వారి వసంత పక్ష ప్రయుక్త శ్రీరామ నవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 17 బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకూ మిథలా స్టేడియంలోని కళ్యాణ మండపంలో స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం శ్రీరామ పునర్వసు దీక్షలు ప్రారంభిస్తారు. ఏప్రిల్ 18వ తేదీ గురువారం శ్రీ స్వామి వారికి మహా పట్టాభిషేకం ఘనంగా జరుగుతుంది. అదే రోజు స్వామి వారికి రధోత్సవం నిర్వహిస్తామని వైదిక కమిటీ తెలిపింది.

Advertisements

You may also like

Our Visitor

025362
Total views : 147069

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.