వీధికుక్కలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

వీధికుక్కలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Advertisements

<p>దేశంలో వీధికుక్కల దాడులు&comma; కుక్కకాట్ల ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి&period; ఈ క్రమంలో వాటి నివారణపై సుప్రీంకోర్టు మంగళవారం అత్యంత కీలకమైన&comma; సంచలన తీర్పు వెలువరించింది&period; మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారిన పిచ్చి కుక్కలు&comma; తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే కుక్కలు&comma; ఆకలితో ఉండే ప్రమాదకరమైన వీధి కుక్కలకు చట్టపరంగా కారుణ్య మరణం ఇవ్వాలని సుప్రీంకోర్టు అధికారుల్ని ఆదేశించింది&period; జస్టిస్ విక్రమ్ నాథ్&comma; జస్టిస్ సందీప్ మెహతా&comma; జస్టిస్ ఎన్&period;వి&period; అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం&period;&period; జంతు ప్రేమికులు&comma; స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టింది&period; వీధికుక్కల్ని షెల్టర్లకు తరలించాలని గతేడాది నవంబర్ లో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని పిటిషన్లలో కోరగా&period;&period; అందుకు ధర్మాసనం నిరాకరించింది&period; ఆసుపత్రులు&comma; బస్ స్టాండ్లు&comma; పాఠశాలలు&comma; రైల్వే స్టేషన్లు&comma; ఎయిర్‌పోర్టులు వంటి పబ్లిక్ ప్రదేశాల నుండి పట్టుకున్న వీధికుక్కలకు వ్యాక్సినేషన్ లేదా స్టెరిలైజేషన్ పూర్తయిన తర్వాత&comma; వాటిని తిరిగి అదే ప్రదేశాలలో వదిలిపెట్టకూడదని గత నవంబర్‌లో కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించడానికి నిరాకరించింది&period; వీధికుక్కల్ని కేవలం జంతుసంరక్షణ కేంద్రాలకే పరిమితం చేయాలని స్పష్టం చేసింది&period; ఈ సందర్భంగా దేశంలో పిల్లలు&comma; వృద్ధులు&comma; టూరిస్టులపై కుక్కలు దాడులు చేస్తున్న ఘటనలపై ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది&period; వీధికుక్కల దాడుల నుంచి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు&comma; స్థానిక అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమయ్యారని కోర్టు తప్పుబట్టింది&period;<&sol;p>&NewLine;<p>హార్ష్ గ్రౌండ్ రియాలిటీలను చూస్తూ కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడంపై జస్టిస్ సందీప్ మెహతా అసహనం వ్యక్తం చేశారు&period; వీధికుక్కల కారుణ్య మరణాలు&comma; వాటిని జంతుసంరక్షణ కేంద్రాలకు తరలించడంపై సుప్రీంకోర్టు జారీ చేసిన ఈ ఆదేశాలను అమలు చేయడంలో వైఫల్యం చెందితే&comma; సంబంధిత అధికారులపై కోర్టు ధిక్కార చర్యలతో పాటు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది&period; హైకోర్టులు స్వయంగా కేసులను నమోదు చేసి ఈ నిబంధనల అమలును పర్యవేక్షించాలని సూచించింది&period; గత ఏడాది జూలైలో ఓ ఆరేళ్ల చిన్నారి రేబిస్ వ్యాధితో మరణించిన వార్త ఆధారంగా సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసును స్వీకరించి&comma; సుదీర్ఘ విచారణ అనంతరం ఈ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..